Hot Posts

6/recent/ticker-posts

జగ్గంపేటలో గురుకుల పాఠశాలను సందర్శించిన సి ఐ వై ఆర్ కె



కాకినాడ జిల్లా ఎస్పీ  జి బిందు మాధవ్  వారు మహిళలు భద్రత ,రక్షణ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అదేవిధంగా విద్యార్థినీ ల హాస్టల్స్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది


కాకినాడ జిల్లా జగ్గంపేట లో  డాక్టర్  బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల లలో జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్, ఎస్ ఐ రఘునందన్ రావు మరియు ప్రిన్సిపాల్  డాక్టర్ జి వి లలిత కుమారి, వైస్ ప్రిన్సిపాల్  బివిసి కుమారి  ఇతర ఉపాధ్యాయులు  రజిని, అమృతవల్లి, ఉషారాణి,సత్యవతి తులసి,సూర్యా వతి మరియు ఇతర పాఠశాల సిబ్బందితో విద్యార్థినీ లకు  ర్యాగింగ్ చట్టం గురించి వివరించి చెప్పి కొత్తగా చేరిన విద్యార్థినీ లను తమ సొంత సోదరీనీ లా జాగ్రత్తగా చూసు కోవాలి అని ఇంటి బెంగ లేకుండా వారిని  కలుపుకుని జాగ్రత్తగా చూసు కోవాలని అదే విధంగా విద్యార్థినీలు అందరూ ఎటువంటి భయాందోళనకు ఎటువంటి భయాలు లేకుండా స్వేచ్చా వాతావరణం లో విద్యను అభ్యసించాలని 

మీకు రక్షణ కల్పించడానికి 24x7 *జగ్గంపేట సర్కిల్ పోలీస్  సోదరులు* మీకు పూర్తి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఏదైనా సమస్య ఉంటే 9440796529 కి గాను, 9440796569 కు గాని,100 గానీ వెంటనే తెలియ జేయా లని తెలియజేయడం జరిగింది.

 శక్తి యాప్  గురించి వివరించి డౌన్లోడ్ చేసుకొని రక్షణ,భద్రత పరముగా ఏ  సమస్య ఉన్న వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని తెలియజేయడం జరిగింది. అని సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ మీడియా వారికి తెలియజేశారు