Hot Posts

6/recent/ticker-posts

రెండు కేజీల గంజాయి తో వ్యక్తి అరెస్ట్

 కాకినాడ జిల్లా ఎస్పీ  జి బిందుమాధవ్  వారి ఆదేశాల మేరకు గంజాయి ఫెడలర్స్ పై నిఘా పెట్టి ఎక్కడా గంజాయి లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది


కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ గండేపల్లి మండలం శివారు ప్రాంతం నేషనల్ హైవే ఎన్ హెచ్ 16 రహదారి జగ్గంపేట సమీపంలో ఆదిత్య హాస్పిటల్ దగ్గరలో ఒక వ్యక్తి గంజాయి తరలిస్తుండగా గండేపల్లి ఎస్ ఐ  శివ నాగబాబు వారికొచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి ఈరోజు కిర్లంపూడి  గ్రామం నకు చెందిన T రాజశేఖర్ వయస్సు 25 సంవత్సరములు అను ఆసామిని రెండు కిలోల గంజాయి తో  పట్టుకోవడం జరిగింది పెద్దా పురం ఎస్ డి పి ఓ శ్రీ హరి రాజు  ఆధ్వర్యంలో జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ గండేపల్లి ఎస్సై శివ నాగ బాబు  మరియు సిబ్బందితో అరెస్టు చేసి గౌరవ పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా  14 రోజులపాటు రిమాండ్ విధించడం జరిగింది. ముద్దాయిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు