Hot Posts

6/recent/ticker-posts

సగర పేటలో ఘనంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశం

 సగర పేటలోతల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం... కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  జ్యోతుల నెహ్రూ


కాకినాడ జిల్లా  జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామపంచాయతీ సగరపేటలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో జిల్లా ఐక్య ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ (పీవీ మాస్టర్) ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అధ్యక్షతన వహించారు  ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ పాఠశాల అభివృద్ధి కోసం  యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి పివి మాస్టారు 3 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. భగీరథ యూత్ ఆధ్వర్యంలో సరస్వతి దేవి విగ్రహం,  సగరపేట గ్రామ పెద్దలు 15000 రూ,  మెగా ఫ్యాన్స్ యూత్ 10000 రూ, నందమూరి ఫ్యాన్స్ యూత్ 5000 రూ, టిడిపి నేతలు పోండ్రు బాలనాగు  కంప్యూటర్, పడాల బాలాజీ కంప్యూటర్,  డాక్టర్ రమణ 25000 రూ, నక్క పెద్ద వెంకటేశులు, నక్క చిన్న వెంకటేశులు, ముల్కి వీర అప్పలరాజు, గాది జీయ్యాన్న, స్కూల్ స్టేజి నిర్మాణం, గండికోట రామస్వామి 15,000, గాది నాగరాజు 10000, విరాళాలు అందించి స్కూల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు. 3 లక్షల రూపాయలు అందించిన పడాల వీర వెంకట సత్యనారాయణ (పివి మాస్టారు)  ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించారు. స్కూల్ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడానికి ప్రతి సంవత్సరం మెగా పేరెంట్స్, టీచర్స్ డే ఏర్పాటు చేసి రెండో సంవత్సరం కూడా విజయవంతంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో ఉన్న పెద్దలు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా విరాళాలు ఇవ్వాలని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఈ మౌలిక వసతులు ఉపయోగించుకుని మంచి విద్యను అభ్యసించి  మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం రుచి హోటల్ నాగేంద్ర చౌదరి సగర పేటకుటమి నాయకులు, గ్రామ సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మి రాఘవ గ్రామ ప్రజలు, నియోజవర్గ కూటమి నాయకులు విద్యాశాఖ అధికారులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.