కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో కోటాలమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఎడ్ల పందాలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ వేడుకకు కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై పందాలను ప్రారంభించారు.
కోటాలమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ యువతను క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామని నాయకులు తెలిపారు. ఎడ్ల పందాలు అంటేనే రైతు బలం, గ్రామీణ వైభవానికి ప్రతీక అని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంచుతాయని జ్యోతుల నవీన్ అన్నారు.
పందాల్లో మొత్తం 20 ఎడ్ల బళ్లు పాల్గొని ప్రేక్షకులకు కనువిందు చేశాయి. బలమైన ఎడ్లు, అనుభవజ్ఞులైన బండి నడిపేవారి నైపుణ్యం చూసి జనం జేజేలు పలికారు.
అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
సీనియర్స్ విభాగం: 1, 2, 3 స్థానాలు
జూనియర్స్ విభాగం: 1, 2, 3 స్థానాలు
విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.
గ్రామ సంప్రదాయాలను గౌరవిస్తూ, యువతకు వేదిక కల్పించిన గ్రామ నాయకుల చొరవను ప్రజలు అభినందించారు. జాతరను విజయవంతం చేసిన గ్రామస్తులు, కార్యకర్తలకు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
