Hot Posts

6/recent/ticker-posts

అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – ఒమ్మి రఘురామ్.

 




అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – ఒమ్మి రఘురామ్.

కాకినాడ జిల్లా జగ్గంపేట, అంబేద్కర్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ మరియు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి సహాయార్థం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వివేకానంద విద్యా సంస్థల అధినేత ఒమ్మి రఘురామ్ రూ. 50,000 యాభై వేల రూపాయలు విరాళాన్ని అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సభ్యులకు, జై భీమ్ యూత్ కి అందజేశారు.

ఈ సందర్భంగా ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపశిల్పి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య మరియు స్వాభిమానానికి చిరునామా అని అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు హక్కులు కల్పిస్తూ ప్రతి భారతీయుడికి సమాన అవకాశాలు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు చేరవేయడానికి భవనాలు, విగ్రహాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయని, వాటి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

విరాళాన్ని స్వీకరించిన అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సభ్యులు ఒమ్మి రఘురామ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే రఘురామ్, అంబేద్కర్ భవన నిర్మాణానికి ఉదారంగా విరాళం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన అందించిన సహాయం నిర్మాణ పనులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువకులు మరియు ప్రముఖులు పాల్గొని ఒమ్మి రఘురామ్‌ను ఘనంగా అభినందించారు.