బాధితురాలు మరణాన్ని అవినీతికి మార్గం చేసుకుంటున్నది ఎవరు !
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి : వైద్య విద్యార్థిణి పై అమానుషంగా కారుతో దాడి చేసి పరారైన నిందితులను కఠినంగా శిక్షించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు
ఎఫ్‌ఐఆర్ లో మోటారు వాహనాల చట్టం సెక్షన్లను విస్మరించడం వెనుక ఆంతర్యమేమిటి ! బి ఎన్ ఎస్ 307, 308 సెక్షన్ లను నమోదు చేయక పోవటం వెనుక డి ఎస్ పి అధికార ఒత్తిడి వుందా !
అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులను కారుతో బలంగా ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా రోడ్డుపై వదిలేసి పారిపోయిన ఘటనను రహస్యంగా దాచి పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది . బాధితులకు న్యాయం చేయడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎఫ్‌ఐఆర్ లో కీలక సెక్షన్లను విస్మరించడంపై మేడా శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విజయవాడకు చెందిన వేణు తుర్యమల్లి వెంకట దుర్గా సాయి ఉమేష్ (M.D. రేడియాలజీ మొదటి సంవత్సరం అతని స్నేహితురాలు కె. ప్రియాంక మొదటి సంవత్సరం లు ప్రసాద్ ఆదిత్య మాల్ సమీపంలో తమ బైక్ (AP 16 FE 6503) పై వెళ్తుండగా... వెనుక నుండి అత్యంత వేగంగా కిరాతకంగా దూసుకొచ్చిన టాటా నెక్సాన్ కారు (AP 40 JF 6299) ఎలాంటి హారన్ కొట్టకుండా వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కారును ఆపి డ్రైవర్‌ను గుర్తించినప్పటికీ... గాయపడిన వారికి ఎలాంటి వైద్య సహాయం అందించకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఇది ముమ్మాటికీ చట్టప్రకారం తీవ్రమైన నేరం." ముద్దాయిలను కాపాడే
డి ఎస్ పి ప్రయత్నం మానవ హృదయాలను కలచి వేస్తుంది . ఈ కేసులో డి ఎస్ పి వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు కారుతో గుద్ది పారిపోయినట్లు బాధితుడు స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చినప్పటికీ, పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో మోటారు వాహనాల చట్టంలోని కీలకమైన సెక్షన్ 184 (ప్రమాదకరమైన రీతిలో వాహనం నడపడం), సెక్షన్ 134 & 187 (ప్రమాదం చేసి బాధ్యత లేకుండా పారిపోవడం) లను ఎందుకు చేర్చలేదు?
నిందితుడిని రక్షించడానికి లేదా కేసు తీవ్రతను తగ్గించి అతనికి సులభంగా బెయిల్ వచ్చేలా చేయడానికే డి ఎస్ పి ఇలాంటి తప్పులు చేశారా ! అని అర్పిసి అధినేత మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్త పరిచారు .డా. ప్రియాంక కేసును ప్రభుత్వం ప్రత్యేక కేసుగా పరిగణించి ఏపి సి ఐ డి వారికి కేసును భధలయించాలని , ప్రస్తుత డి ఎస్ పి ప్రమేయాన్ని ఈ కేసు నుండి తొలగించాలని మేడా శ్రీనివాస్ కోరారు ..
