జగ్గంపేటలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
కాకినాడ జిల్లా, జగ్గంపేట లో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట సున్ని జామియా మసీద్ దగ్గర నుండి పుర వీధుల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు గఫూర్ మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జన్మించి నేటికి 1500 సంవత్సరాలు పూర్తయిందని, అదే విధంగా మహ్మద్ ప్రవక్త ఇదే రోజు వివాహం చేసుకోవడం, అదే విధంగా మరణించడం కూడా ఇదే రోజు అని తెలిపారు. దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జీవియర్ కాంప్లెక్స్ వద్ద మండల టీడీపీ అధ్యక్షుడు జీను మణిబాబు ఆధ్వర్యం లో ముస్లిం సోదరులకు బిస్కెట్లు, పండ్లు , డ్రింక్ లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్గంపేట లో ముస్లిం సోదరులందరు ప్రజలు బాగుండాలని , అదే విధంగా ప్రాంతం బాగుండాలని గ్రామమంతా ప్రవచనాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం ఆనందదాయకరమన్నారు. అదే విధంగా జగ్గంపేట సిఐ , ఎస్సైలు మాట్లాడుతూ ముస్లిం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ అరీఫ్. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ భాష. సెక్రటరీ షేక్ రెహమాన్. షేక్ సలీం. వర్క్ షాప్ బాబు. మహమ్మద్ అలీ. సయ్యద్ బాజీ. పెద్దకాజా. యమ్డి ఇబ్రహీం. షేక్ మొహిద్దీన్. ఎస్ కే వల్లి. యమ్ డి కాజా. యమ్ డి జాన్. అమీర్. షేక్ అలీషా. షేక్ మిరీషా. తదితరులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.




