పెద్దాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్
కాకినాడ జిల్లా, పెద్దాపురం: జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా
జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు
జిల్లావ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్లు నిరంతరం నిర్వహిస్తున్నారు
పెద్దాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండయ్య పేట (క్రిస్టియన్ పేట), జగన్న న్న కాలనీ ప్రాంతం లలో మాదకద్రవ్యాల నియంత్రణ, నేర కార్యకలాపాల కట్టడి మరియు శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ లో భాగంగా ఈ రోజు ఉదయం 05:30 గంటల నుండి 08:30 గంటల వరకు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించడం జరిగింది.
ఆపరేషన్ ముఖ్యాంశాలు:
తనిఖీ చేసిన ఇళ్లు – 25
🔹 ప్రజలతో ముఖాముఖి – 100 మంది
🔹 సరైన పత్రాలు లేని వాహనాలు – 07
🔹 అనుమానాస్పద ప్రాంతాలు మరియు ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం
🔹 కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకోవడం
🔹 శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం
అదేవిధంగా కాలనీ ప్రజలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువతపై వాటి ప్రభావం మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచిస్తూ ప్రజలతో మాదక ద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ ఆపరేషన్ లో పోలీస్ శాఖ మరియు EAGLE టీమ్ సిబ్బంది సమన్వయంతో పాల్గొని సంయుక్తంగా మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు.


