Hot Posts

6/recent/ticker-posts

జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి లో వనం మనం కార్యక్రమం.





 జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి లో వనం మనం కార్యక్రమం.

పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం: రాజువమ్మంగి మండలంలో  జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఫౌండర్ చైర్మన్ టి రామచంద్ర నాయుడు సీఈఓ వారి ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు వనం మనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల ప్రెసిడెంట్ గౌరీ శివలక్ష్మి అధ్యక్షతనలో రాజోమంగి ప్రభుత్వ జూనియర్ బాలికల వసతి గృహం నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వసతి గృహం అధికారి లక్ష్మీ ఆదినారాయణ దంపతులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండవ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని మరొక ప్రాంతంలో కొనసాగిస్తామని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ  మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రమణి ,నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్నాథం,  మండల ప్రెసిడెంట్ గౌరీ శివలక్ష్మి తెలియజేశారు. మండలంలో మిగిలిన సభ్యులు కూడా రెండవ రోజు కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో  వసతి గృహం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు