ప్రభుత్వం చేసే ప్రతి పని తమ సొంత పనిలా భావించి ప్రజల కోసం ప్రజల మనిషిగా మనసున్న మహారాజే జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.
మాటల మనిషి కాదు చేతల మనిషిని అంటూ నిరూపించుకుంటున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.
కృష్ణవరం వద్ద ఏలేరు-గోదావరి అనుసంధాన సూయిస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా కిర్లంపూడి, : పోలవరం కాల్వ నుంచి గోదావరి నీటిని ఏలేరులోకి అనుసంధానించే సూయిస్ నిర్మాణ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మంగళవారం కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏలేరు-గోదావరి అనుసంధాన సూయిస్ నిర్మాణం ప్రారంభమైందని, అనంతరం వైసీపీ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమయ్యాయని చెప్పారు.
ఈ సూయిస్ ద్వారాజగ్గంపేట,పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో 53 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను, ఏలేరు కిర్లంపూడి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్, జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి బొడ్డెట్ల సుబ్బారావు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
-

