కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యులు , టిటిడి బోర్డు సభ్యుడు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
జ్యోతుల నెహ్రూ సతీమణి మణమ్మ, కుమారుడు, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, కోడలు లక్ష్మీదేవి, మనవడు అనీష్ నెహ్రూ తదితరులు ఆర్జిత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు శ్రీవారి శేషవస్త్రం కప్పి వేదాశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని కోరినట్లు తెలిపారు.
ప్రజాసేవయే పరమావధిగా పనిచేస్తూ, భక్తి, ఆధ్యాత్మిక విలువలను ముందుకు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నట్లు చెప్పారు.
దర్శన అనంతరం ఆలయ అధికారులు ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను కూడా పరిశీలించారు.

