జగ్గంపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం
* జెండా ఆవిష్కరించిన అడపా
* తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పణ
* ఉత్సాహంగా మోటార్ సైకిల్ ర్యాలీ
* ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ
నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి సభ్యులు అడపా వెంకట్రావు జెండా ఆవిష్కరించారు. నియోజకవర్గ పరిధిలోని నాయకులు, సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు కాలి నడకన ర్యాలీ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జెండా రెపరెపలతో, ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు మారుమోగాయి. తాసిల్దార్ జె.వి.ఆర్ రమేష్ కు తమ అపరిస్కృత సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందించారు. దశాబ్దాల కాలంగా విలేకరులకు ఇళ్ల స్థలాల పంపిణీ, రిటైర్ అయిన విలేకరులకు పెన్షన్, హెల్త్ స్కీమ్ అమలు, ప్రమాద బీమా సౌకర్యం, విలేకరులపై భౌతిక దాడులు నియంత్రణ వంటి సమస్యల పరిష్కారానికి తాసిల్దార్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. సిహెచ్ సి సూపరిండెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 70 వార్షికోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఏపీడబ్ల్యుఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 70 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమానికి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తుంది అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం జర్నలిస్టుల యూనియన్ పటిష్టంగా సాగుతుందన్నారు.
అందరూ సమిష్టిగా ఉద్యమిస్తే ప్రభుత్వం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పెనుగాడి సూరిబాబు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి చిక్కాల మణికంఠ, నియోజకవర్గ కార్యదర్శి చింతల రాంబాబు, రాయుడు సూర్య ప్రకాశరావు, వెలిది వెంకటరత్నం, నేదురి శ్రీధర్, కాపవరపు భాస్కరరావు, అలమండ శ్రీనివాసరావు, పాండురంగారావు, గండే నాని, సుంకర శ్రీనివాసరావు, శ్రీమతి రమ్య, శ్రీమతి అరుణ,బోదిరెడ్డి దుర్గారావు. వలి ఖాన్ పఠాన్, సాంబశివ, ఋషి రామ్, మధు పలువురు ఏపీయూడబ్ల్యూజే సభ్యులు పాల్గొన్నారు.
![]() |














