నియోజకవర్గం లోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలలను సన్మానించిన జనసేన పార్టీ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్
కాకినాడ జిల్లా జగ్గంపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిణయ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ స్త్రీ జన్మ ఈ సృష్టిలో ఎంతో పవిత్రమైనది మరియు ప్రాముఖ్యమైనది స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అటువంటి స్త్రీలను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత గా స్వీకరించాలి అని అన్నారు
పారిశుద్ధ్య వృత్తిలో ఉన్న మహిళలకు హోంగార్డు మహిళలకు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళలకు విద్యారంగంలో ఉన్నటువంటి మహిళలకు ఆశ వర్కర్లకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ సేవ రత్న అవార్డు తో ఘన సన్మానం చేసినారు వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ అధ్యక్షత వహించినారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల అధ్యక్షులు మరిసే రామకృష్ణ, టౌన్ అధ్యక్షులు గవర సుధాకర్,కే గీత వరలక్ష్మి ఎస్ ఎం కుమారి వివిఎన్ఎస్ వరలక్ష్మి వీ రేవతి ఎస్ వరలక్ష్మి టి అనిత ఆర్ విజయ్ కుమార్ అనిత రాజశ్రీ కే లక్ష్మి వడ్డీ ఝాన్సీ రాణి మాదారపు వీరబాబు పాలెం బాబీ, కాయల మణికంఠ, పండు తదితరులు పాల్గొన్నారు



