Hot Posts

6/recent/ticker-posts

ప్రతీ విద్యార్థిని ఉన్నత చదువుల దిశగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిది - జ్యోతుల నవీన్

 


ప్రతీ విద్యార్థిని ఉన్నత చదువుల దిశగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిది - జ్యోతుల నవీన్

 కాకినాడ జిల్లా, జగ్గంపేట జూలై 24:జగ్గంపేట హైస్కూల్ లోను  రామవరం స్కూల్ వద్ద జరిగిన _మెగా పేరెంట్స్ మీటింగ్_ కు కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు *జ్యోతుల నవీన్* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి విద్యార్థిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో చదువుకోవాలని అన్నారు. 

మీటింగ్ లో కీలక అంశాలు:

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి విద్యా ప్రమాణాల మెరుగుదలపై విస్తృత చర్చ

పిల్లల చదువు, ప్రవర్తన, ఆటలు-సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచనప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య + మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ దృష్టి

  ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి  నారా లోకేష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ  నాయకత్వంలో విద్యార్థుల నైపుణ్యం, సృజనాత్మకత పెంచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది.

ప్రభుత్వం అందిస్తున్న పథకాలు:

1. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

2. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ల పంపిణీ

3. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ₹15,000 జమ

4. షైనింగ్ అవార్డులు - పరీక్షల్లో టాప్ చేసిన విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు 20వేల రూపాయలు నగదు బహుమతి 

5. ప్రతీ విద్యార్థిపై ఏటా ₹83,000 ప్రభుత్వ ఖర్చు చేస్తుంది.

ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో సమూల  మార్పులు వచ్చాయని, అందులో భాగంగానే _మెగా పీటీఎం 2.0_ ని పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని నవీన్ తెలిపారు. ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కళాశాల వరకు ప్రతి చోటా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే ఈ మీటింగ్ లని అన్నారు.

ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, సీఏ తిరుపతిరావు, ప్రిన్సిపల్ రంగారావు  ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.