ముఖ్య అతిథి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి తిరుపతిరావు ,
విశిష్ట అతిధి సబ్ ఇన్స్పెక్టర్ రఘునాధరావు,
కాకినాడ జిల్లా జగ్గంపేటలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఫౌండర్ చైర్మన్ టి రామచంద్ర నాయుడు సీఈవో వారి ఆదేశాల మేరకు జగ్గంపేటలో రెండవ సచివాలయం ప్రాంగణంలో వనం మనం కార్యక్రమాన్ని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం వీర రాఘవ అధ్యక్షతనలో కార్యక్రమ నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి తిరుపతిరావు, విశిష్ట అతిథిగా సబ్ స్పెక్టర్ టి రఘునాధరావు హాజరయ్యారు, వనం మనం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నిర్మూలన లో భాగంగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి తిరుపతిరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణర్ధం మొక్కలను నాటడం వల్ల రానున్న భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించిన వాళ్ళం అవుతామని మన పరిసరాల్లో మొక్కలను పెంచడం వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలికల వసతి గృహం విద్యార్థులకు ఆయన తెలియజేశారు,
విశిష్ట అతిధి సబ్ ఇన్స్పెక్టర్ , టి రఘునాధ రావు మాట్లాడుతూ వేసిన మొక్కలు వృధాగా పోకుండా మొక్కల రక్షణ ఉండే విధంగా నీళ్లు పోసి వాటిని పరిరక్షించాలని బాలికల వసతి గృహ విద్యార్థులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం , మండల అధ్యక్షులు కాపవరపు వెంకటరాజు, బాబ్జి కాకినాడ జిల్లా అడిషనల్ సెక్రటరీ, కొలిమల్ల దుర్గాప్రసాద్ అలియాస్ పట్టాభి , తూర్పుగోదావరి జిల్లా జోనల్ కోఆర్డినేటర్ జి నాని బాబు, సచివాలయం వ్యవసాయ అధికారి శ్యామ్ , మరియు ఇ అశోక్ రాజ్ బాలికల వసతి గృహ విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










