ఏజెన్సీ చెరుకుంపాలెం గ్రామంలో ఘనంగా వనం -మనం కార్యక్రమం,
ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జనరల్ సెక్రటరీ దాసరి సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు అధ్యక్షతన,
ముఖ్యఅతిథిగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ పఠాన్,
పోలవరం జిల్లా: రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగి మండలం, చెరుకుపాలెం. గ్రామంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఫౌండర్ చైర్మన్ టి రామచంద్ర నాయుడు ,సీఈవో. నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ,కె ,మాధవి లత. ఇరువురి ఆదేశాల మేరకు చెరుకుంపాలెం గ్రామంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జనరల్ సెక్రటరీ దాసరి సూర్యనారాయణ, అధ్యక్షతనలో జిల్లా కమిటీ సభ్యులు పున్నపు చిన్నతమ్మారావు, రాజవొమ్మంగి మండల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కుంజం జగన్నాథం , మహిళా విభాగం ప్రెసిడెంట్, లింగేటి గౌరీ శివలక్ష్మి ల ఆధ్వర్యంలో వనం- మనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ, రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ హాజరయ్యారు, వలి ఖాన్ మాట్లాడుతూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి మన వంతు ప్రయత్నం గా స్వచ్ఛందంగా ముందడుగు వేసి వీలైనంత మొక్కలను నాటి వాటి సంరక్షణ చూడగలిగితే అవి వృక్షాలుగా మారి రానున్న తరాలకు మంచి ప్రాణవాయువును ఇస్తాయని మన వంతు ప్రయత్నం గా కొంతవరకు వాయు కాలుష్యాన్ని నివారించగలమని అందరూ కలిసి ముందడుగు వేసి రానున్న భావితరాలకు ఈరోజు నాటిన మొక్కలు రానున్న భావితరాలకు మంచి వృక్షాలను అందించే మా ప్రయత్నంలో మాకు సహకరిస్తున్న అధికారులకు పంచాయతీ సచివాలయం సిబ్బంది లకు సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మండల కమిటీ సభ్యులు బర్రె వెంకటరమణ, కందుల గోవిందు దుర్గారావు , పంచాయతీ కార్యదర్శి, జై బున్నిషా బేగం,... డిజిటల్ అసిస్టెంట్, పి సోమలింగం,. వెల్ఫేర్ అసిస్టెంట్ ,కే శ్రీను బాబు. వెటర్నరీ అసిస్టెంట్, పి అమ్మిరాజు. ఏఈఓ, దుర్గ భవాని. గ్రామస్తులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ , గట్టెం మాణిక్యం. పీసా అధ్యక్షురాలు, భూముల సరస్వతి. టిడిపి నాయకురాలు , మడకం కమలాదేవి. ప్రకృతి వ్యవసాయం నిపుణులు, కాసులమ్మ. టిడిపి నాయకులు, కొప్పిశెట్టి వీరబాబు , కొండ పెద్ద టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్, గరికపాటి వీరబాబు. దాసరి మూర్తి, గరికి వెంకటేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










