పగలంతా ఈ గల మోత రాత్రి అయితే దోమల పోట్లు,
వెలమపేటలో నీటి కొరత ఇబ్బంది,
పట్టించుకోని పంచాయతీ సిబ్బంది.
కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం గుర్రప్పాలెం : గ్రామం లో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం నిర్లక్ష్య ధోరణిలో పంచాయతీ సిబ్బంది గత రెండు నెలలుగా నీటి కొరతతో ఇబ్బందులు పాలవుతున్న వెలమపేట వాస్తవ్యులు రామాలయం దగ్గర నుండి వెలమల పేట రజకుల వీధి ప్రాంతాలలో కుళాయిలు రాకపోవడం వల్ల గత రెండు నెలలుగా ఎన్నోసార్లు పంచాయితీ వారికి విన్నవించుకోగా ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు నీటి సరఫరా చేయడంలో పంచాయతీ సిబ్బంది విఫలమయ్యారు.
గత పాతిక సంవత్సరాల క్రితం వేసినటువంటి పాత పైపుల ద్వారానే నీరు సరఫరా కావాలంటే ఏ విధంగా అవుతుంది పైపులైన్లు సరైన పద్ధతిలో లేకపోవడం వల్ల ఎప్పుడు చూసినప్పటికీ నీటి కొరత వెంటాడుతూనే ఉంటుంది గడచిన ప్రభుత్వ కాలంలో కొత్త పైపులైన్లు నిర్మాణం చేసి ప్రతి ఇంటికి నీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారే తప్ప ఇప్పటివరకు ఏ విధమైన పనులు సవ్యంగా జరగలేదు .
నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నవి కాకుండా పారిశుద్ధ్యం లోపించడం వల్ల పగలంతా ఈ గల మోత రాత్రి అయితే దోమల పొట్లు అన్నట్టు ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పేరుకు మాత్రం పారిశుధ్య కార్మికులు రోడ్లు ఉడచడం తప్ప మురికి నీరు పోవడానికి కాలువలను శుభ్రం చేయలేకపోవడం వల్ల ఎక్కడ నీరు అక్కడే ఉండిపోవడం వల్ల ఈగలు దోమలు పెరిగిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు గుర్రప్పాలెం గ్రామంలో సచివాలయం పరిసర ప్రాంతాలలోనే పారిశుద్ధ్యం లోపించింది.
గ్రామంలో ఏ విధమైన పారిశుధ్యం చేస్తున్నారు పంచాయతీ సిబ్బంది పారిశుధ్యం లోపం ఒకవంతు అయితే మరోపక్క గ్రామం చుట్టూ కోళ్ల ఫారాలు ఎక్కువ కావడం వల్ల గ్రామంలో ఈగల బెడద ఎక్కువైంది ఇదే పద్ధతిలో కొనసాగితే వర్షాకాలం మొదలైంది అంటే ప్రజలంతా అనారోగ్యాలు పాలవ్వడం తప్పదని ప్రజలంతా వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుర్రపాలెం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పరచాలని డ్రైనేజీలపై అక్రమాణాలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పరిచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యాలు పాలవ్వకుండా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తగు సుభ్రతులు చేయించవలసిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు










