కష్టపడి కాదు...ఇష్టపడి చదవండి" విద్యార్థులతో సూర్యచంద్ర
కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం: వేలంక గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన సూర్యచంద్ర చదువును భారంగా భావించి 'కష్టపడి' కాకుండా, సబ్జెక్టును అర్థం చేసుకుంటూ 'ఇష్టపడి' చదివినప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఇష్టపడి చదవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని విద్యార్థులకు పాటంశెట్టి సూర్యచంద్ర సూచించారు.
కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి,విద్యార్థుల సందేహాలు తీర్చి, విద్యాభివృద్ధిపై విద్యార్థులను చైతన్యపరిచారు.చాలామంది విద్యార్థులు చదివింది గుర్తుండటం లేదు అని బాధపడుతుంటారని దానికి కారణం జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం కాదని,ఆ సబ్జెక్టుపై ఆసక్తి లేకపోవడమేనని.ఏ విషయాన్నైనా మనం ఇష్టపడి,శ్రద్ధగా చదివితే అది మన మెదడులో బలంగా ముద్ర పడిపోతుందన్నారు.
జ్ఞాపకశక్తి అనేది బట్టీ పట్టడం వల్ల రాదని,ఇష్టపడటం వల్ల వస్తుందని ఒత్తిడి లేని విద్యా విధానం ద్వారా చదువు అనేది జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండాలని, ఒత్తిడి పెరిగితే ఉన్న జ్ఞాపకశక్తి కూడా నశిస్తుందని కాబట్టి విద్యార్థులపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ర్యాంకుల కోసం ఒత్తిడి తేవడం ఆపాలని సూర్యచంద్ర కోరారు.నాణ్యమైన విద్యే లక్ష్యంగా ఒత్తిడి లేని, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడానికి, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ విధానాలను తీసుకురావాలని సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తని,చదువును ఆనందిస్తూ సాగించాలని.పరీక్షలను చూసి భయపడవద్దని.ఇష్టపడి చదివి, మీ ఆలోచనా శక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుకుని మీ లక్ష్యాలను చేరుకోవాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులకు తెలియజేశారు*

