Hot Posts

6/recent/ticker-posts

పాలకొల్లులో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులకు శిక్షణ తరగతులు


పాలకొల్లులో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులకు శిక్షణ తరగతులు 

పశ్చిమగోదావరి జిల్లా...పాలకొల్లు లో ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో  ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ  ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన  ట్రైనింగ్ ప్రోగ్రాంలో ముఖ్యఅతిథిగా సీఈఓ అండ్ చైర్మన్ టి.ఎస్ రామచంద్ర నాయుడు మరియు నేషనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ డైరెక్టర్ కే. మాధవి పాల్గొని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ పై హ్యూమన్ రైట్స్ సభ్యులకు మానవ హక్కుల పరిరక్షణ, పౌర హక్కుల పరిరక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ, బాలల హక్కుల పరిరక్షణ, వృద్ధుల హక్కుల పరిరక్షణ, మొక్కలు నాటుట, వెనకబడిన కులాల హక్కుల పరిరక్షణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ, జంతువుల రక్షణ, ఆర్.టి.ఐ సేవలు, పర్యావరణ పరిరక్షణ, న్యాయ సలహాలు మరియు లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై సలహాలు సూచనలు అందించారు. హ్యూమన్ రైట్స్ అన్యాయం అక్రమాలపై  పోరాటం చేస్తూ ప్రజలకు న్యాయం చేకూరే దిశగా కృషి చేస్తుందన్నారు. అనంత ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అందించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  మండపాక రాంబాబు, డిస్టిక్ జనరల్ సెక్రెటరీ E. శేషాద్రి నాయుడు, పాలకొల్లు టౌన్ ప్రెసిడెంట్ పి.రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ జే. మదన్మోహన్, తణుకు నియోజకవర్గ ఇన్చార్జ్ జి. జయకృష్ణ, ఆచంట నియోజకవర్గ వి. రామకృష్ణారెడ్డి  మరియు ఇతర జిల్లాలు, నియోజవర్గల నుండి విచ్చేసిన ఇన్చార్జిలు, ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమం పట్ల సలహాలు సూచనలు అందించిన సీఈఓ రామచంద్ర నాయుడు ని  నేషనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్ మాధవి లత ని గౌరవప్రదంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు సభ్యులు..