Hot Posts

6/recent/ticker-posts

కులమత, పార్టీల భేదం లేకుండా ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం – జ్యోతుల నవీన్



 జగ్గంపేటలో 16 మంది లబ్ధిదారులకు రూ. 21 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన... జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

కులమత, పార్టీల భేదం లేకుండా ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం – జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా జగ్గంపేట,  పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య, ఆర్థిక అవసరాలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్  అన్నారు.మంగళవారం జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది లబ్ధిదారులకు రూ. 21 లక్షల విలువైన నగదు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా జ్యోతుల నవీన్  మాట్లాడుతూ, “ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచే మహోన్నత సంస్కృతి తెలుగుదేశం ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమే పరమావధిగా పాలన సాగిస్తున్నారు అని. అనారోగ్యంతో బాధపడే ప్రతి పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు” అని కొనియాడారు.

జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శాసనసభ్యులు  జ్యోతుల నెహ్రూ అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన కృషి వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కులమతాలు, పార్టీల భేదాలు లేవు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నాం. ఇదే మా ప్రభుత్వ విధానం, ఇదే మా నాయకుల లక్ష్యం” అని నవీన్  స్పష్టం చేశారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, వీరం రెడ్డి కాశి బాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి రేఖా బుల్లి రాజు, ఉప్పలపాటి బుల్లెబ్బు,బస్వా చినబాబు, వేములకొండ జోగారావు టిడిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం, నాయకుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారు.