Hot Posts

6/recent/ticker-posts

తాళ్లూరు లిఫ్ట్ పనులకు 19న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన





 తాళ్లూరు లిఫ్ట్ పనులకు 19న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన  

52 కోట్లతో పునరుద్ధరణ, జూలై 20కల్లా పూర్తి చేసి ఖరీఫ్‌కు నీరందించే లక్ష్యం

రూట్ మ్యాప్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఇరిగేషన్ ఈ ఈ రాజేశ్వరరావు, డి.ఎస్.పి ఏబిజె తిలక్, సి ఎ తిరుపతిరావు

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం  : గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో దశాబ్దాలుగా రైతుల ఎదురుచూపులకు తెరపడనుంది. తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు ఈ నెల 19న రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 

ఈ విషయాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం తెలిపారు. శంకుస్థాపనకు సంబంధించిన రూట్ మ్యాప్, ఏర్పాట్లను ఆయన ఇరిగేషన్ ఈ ఈ రాజేశ్వరరావు పెద్దాపురం డి.ఎస్.పి ఏ బి జె తిలక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ:గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాళ్లూరు లిఫ్ట్ సుమారు ఆరు సంవత్సరాలుగా మూలనపడి రైతులకు తీవ్ర నష్టం కలిగించిందన్నారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి, రెండో ఏడాదిలోనే 52 కోట్ల రూపాయలతో లిఫ్ట్ పునర్ వ్యవస్థీకరణకు కేబినెట్‌లో ఆమోదం తెలిపారని తెలిపారు.నిధులు మంజూరు, టెండర్ ప్రక్రియ పూర్తయ్యాయని, పనులు దక్కించుకున్న మెగా కంపెనీ ప్రతినిధులతో సాంకేతిక అంశాలపై చర్చించి పనులు వేగవంతం చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.జూలై 20కల్లా పూర్తి:శంకుస్థాపన అనంతరం పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి, రాబోయే ఖరీఫ్ సీజన్ జూలై 20వ తేదీకల్లా పూర్తి చేసి తాళ్లూరు, చుట్టుపక్కల గ్రామాల రైతుల పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు.

శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, జీను మణి బాబు, కందుల చిట్టిబాబు,  , ఇరిగేషన్ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.