కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా జగ్గంపేట గ్రామానికి చెందిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మానవతా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల మన్ననలను పొందుతున్న యువ నాయకుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి పాలకమండలి సభ్యునిగా నియమితులయ్యారు. ప్రభుత్వం 17 మంది బోర్డు సభ్యులుగా నియమిస్తూ జీవో విడుదల చేశారు. అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైనందున నాగేంద్ర చౌదరి కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు ఆనందం వ్యక్తపరిచి శుభాకాంక్షలు తెలియజేశారు

