Hot Posts

6/recent/ticker-posts

నీటి భద్రతకు కూటమి సర్కార్ సుస్థిర బాటలు



 నీటి భద్రతకు కూటమి సర్కార్ సుస్థిర బాటలు

నీటి సంరక్షణ పై అందరూ బాధ్యతగా ఉండాలి

నీటి భద్రత -సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి

ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి సంయుక్త కలెక్టర్ స్మరణ రాజు, సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ 

 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రంపచోడవరం :  భద్రత కోసం కూటమి ప్రభుత్వం బృహత్తర యజ్ఞం చేస్తుందని ఎమ్మెల్యే,రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రంప చోడవరం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ సమావేశపు హాలులో సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు ఐటిడిఎ  ప్రాజెక్ట్ అధికారి  బచ్చు స్మరణ రాజు అధ్యక్షతన నీటిభద్రత -సాగునీటి సంఘాల బాధ్యత, అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నీటి భద్రత పై విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత సంబoధిత యత్రాంగంపై ఉందన్నారు. అనేకచోట్ల నీరు వృథాగా పోవటం మరికొన్ని చోట్ల నీటి ఎద్దడి ఏర్పడటం మన్యంలో చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా నీటి భద్రత సంరక్షణ కోసం భూగర్భ జలాల స్థాయిని పెంపుదల చేయాల్సిన బాధ్యతపై కూటమి ప్రభుత్వం రైతన్నల సాగునీటి కోసం మరియు ప్రజానీకానికి త్రాగునీటి కోసం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దీనిని సాగునీటి సంఘాల బాధ్యులు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దీనిలో భాగంగా పోలవరం జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, జలాశయాలు వగైరా నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆయా నీటి సంరక్షణ కోసం వాటిని పునరుద్ధరణ చేయాల్సిన అవసరం పై వివరించారు. తద్వారా రైతాంగానికి కలిగే ప్రయోజనాలపై క్షుణ్ణంగా వివరించారు. పూడికతీతలు, అనుసంధాన కాలువల అభివృద్ధి పై సంబంధిత సిబ్బంది అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామస్థాయిలో నుండి ఏయే ప్రాంతాల్లో నీటి భద్రత పై అవసరం ఉందో కూటమి నాయకులు సంబంధిత అధికారులుతో ప్రతిపాదనలు చేయించాలని సూచించారు. దీనికోసం నేటి నుండి 100 రోజులు పాటు ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పనులు గుర్తింపు, నిధులు మంజూరు, తరువాత ఆయా పనులు అమలుచేయుట వగైరా కార్యాచరణ ప్రణాళికబద్ధం గా చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఎంపిడిఓ, తహసిల్దార్, నీటి పారుదల శాఖ, భూగర్భ శాఖ, వ్యవసాయ, అటవీ శాఖ అధికారులతో సాగునీటి సంఘాల ప్రధాన బాధ్యతగా క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణ ప్రజా ఉద్యమంగా చేపట్టాలని రాష్ట్ర భవిష్యత్తుకు నీటి భద్రత కల్పించే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, సంయుక్త కలెక్టర్ మరియు ఐటిడిఎ PO స్మరణ రాజు సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ మరియు ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పై క్షుణ్ణంగా వివరించారు. దీనిని అందరి బాధ్యతగా ఒక యజ్ఞం లా అమలు చేయాలని సూచించారు.


కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బొజ్జిరెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ స్మరణ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నొక్వల్, ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభానీ, మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, క్లస్టర్ ఇంచార్జి కారం సింహాచలం, సీతపల్లి గడి బాపనమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కుంజం బాపన్న దొర, నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా చెల్లన్న దొర అనే బాబీ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోసు నాగన్న దొర, మాజీ సర్పంచ్ నిరంజనీదేవి, సాదల సత్య, పెంటమ్మ, పతివాడ రమణ, గల్లా సత్యనారాయణ, ఈక నాగన్న దొర పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.