Hot Posts

6/recent/ticker-posts

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను భగీరథ జయంతి కి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించిన సగర సంఘం నేతలు


 జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను భగీరథ జయంతి కి ముఖ్య అతిథిగా  ఆహ్వానించి ఘనంగా సత్కరించిన సగర సంఘం నేతలు


కాకినాడ జిల్లా జగ్గంపేట : ఈనెల 23వ తేదీన భగీరథ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించి అనంతరం ఇటీవల తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా జ్యోతుల నెహ్రూను టిడిపి అధిష్టానం నియమించడంతో , ఆయననుమర్యాదపూర్వకంగా కలిసి   సన్మానించి  శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గంపేట నియోజకవర్గం సగర సంఘం నేతలు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ  రాజకీయ అనుభవం  టిడిపి పార్టీకి మరింత బలం చేకూరుస్తుందనిఅన్నారు. అదేవిధంగా ఆయనకు కొత్త బాధ్యతలు రావడం సంతోషం గా ఉంది అని , భవిష్యత్తులో ప్రజలకు ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని  ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పోండ్రు బాలనాగు, పోట్రు కృష్ణ,పోట్రు రాముడు, చనిబోయిన నూకరాజు, నక్క వెంకటేష్, దండ్రు వీరబాబు, ములికి రాంబాబు, యడల చిరంజీవి, రేగాకుల జగ్గ గోపాల్, తంగేళ్ల పెద్ద అప్పన్న, గండికోట శ్రీను అధిక సంఖ్యలో సగర పెద్దలు పాల్గొన్నారు.