ప్రకృతిని రక్షిద్దాం...రేపటి తరానికి ఆరోగ్యకరమైన భూమిని అందిద్దాం
పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్ధి
కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం బూరుగుపూడి : పంచభూతాలలో ప్రధానమైనది భూమి (ధరిత్రి) అని మన జీవనాధారం మొత్తం భూమి పైనే ఆధారపడి ఉందని మనకు ఆహారాన్ని అందిస్తున్న భూమాతను మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యతగా భావించాలని భూమిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమేనని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజలను కోరారు. నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బూరుగుపూడి గ్రామంలో తమ ఇంటి వద్ద రేగుపండ్ల మొక్కను నాటారు. పురుగుమందులు,రసాయనికి ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం చేస్తూ మొక్కలు నాటడం, పెంచడమే నేల తల్లికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు

