Hot Posts

6/recent/ticker-posts

ఇర్రిపాకలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు



 ఇర్రిపాకలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు 

జ్యోతుల నెహ్రూ సతీమణి మణమ్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు.

కాకినాడ జిల్లా,: జగ్గంపేట మండలం ఇర్రిపాక క్లస్టర్ 8లో అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జగ్గంపేట శాసనసభ్యుడు, టీటీడీ పాలక మండలి సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ సతీమణి మణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మణమ్మ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

అనంతరం పార్టీ మహిళా నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మణమ్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు, ఆశయాలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బస్వా చిన్న బాబు,బుర్రి సత్తిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, జ్యోతుల నాగబాబు, పంతం సత్యనారాయణ, జ్యోతుల సత్యమూర్తి, కోనేటి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.