కాకినాడ జిల్లా జగ్గంపేట :పాలచర్ల అనంతలక్ష్మి జ్ఞాపకాలను సేవా సౌరభాలుగా మార్చుతూ, సమాజ హితమే ధ్యేయంగా చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ వద్ద నాగేంద్ర చౌదరి తమ తల్లి అనంతలక్ష్మి జ్ఞాపకార్థం శాశ్వత చలివేంద్రం కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తెలియజేశారు.
భానుడి భగభగలతో అలమటిస్తున్న పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులు, స్థానిక ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఎండల తీవ్రత నుండి ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్పించే సంకల్పంతో, 365 రోజులు అందుబాటులో ఉండేలా శీతల ఫిల్టర్ వాటర్‌తో కూడిన చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన అన్నారు“మనిషి జీవితంలో సేవాభావం కన్నా గొప్పది మరొకటి లేదు” అన్న పాలచర్ల అనంతలక్ష్మి మాటలే స్ఫూర్తిగా, ఆమె చూపిన మానవతా మార్గంలో నడవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం అని నాగేంద్ర చౌదరి అన్నారు
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. “మాతృదేవోభవ” అనే భావనను సజీవంగా నిలుపుతూ, అమ్మ జ్ఞాపకాలను సేవ రూపంలో కొనసాగించడం జీవితకాల బాధ్యత. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతాం అని నాగేంద్ర చౌదరి తెలియజేశారు.

