కాకినాడ జిల్లా జగ్గంపేట, : టీడీపీ ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గంలో మహానాడును విజయవంతం చేసిన క్లస్టర్ ఇంచార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులను ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు ఘనంగా సన్మానించారు.
సన్మానం అందుకున్నవారు: క్లస్టర్ ఇంచార్జ్‌లు: కన్నబాబు, అడపా భరత్ కుమార్, జాస్తి వసంత్, పాలకుర్తి ఆదినారాయణ, బస్వా సూర్య ప్రకాష్ రావు (చినబాబు), దేవరపల్లి మూర్తి, పాఠం శెట్టి మురళి కృష్ణ, కుర్ల చినబాబు
మండల అధ్యక్షులు: జీను మణిబాబు, పిల్ల చంటిబాబు, వీరం రెడ్డి కాశి బాబు, పోతుల మోహన్రావు జ్యోతుల నెహ్రూతో పాటు కాకినాడ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, నియోజకవర్గ టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు:
"పార్టీ కోసం కష్టపడిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. కష్టపడిన కార్యకర్తలను సన్మానించడం అంటే మనల్ని మనం సన్మానించుకోవడమే. ఇది మంచి సాంప్రదాయం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






