పట్టు వస్త్రాలు సమర్పించింది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణిమ్మ, విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగ్గంపేట, ఏప్రిల్ 26, జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 1021వ జయంతి మహోత్సవాన్ని జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్, వనిత క్లబ్, వాసవి సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఉదయం అమ్మవారిని ప్రత్యేక రథంలో సర్వాంగ సుందరంగా అలంకరించి పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 108 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి జ్యోతుల మణిమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.విశిష్ట అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జ్యోతుల మణిమ్మను, జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించి వాసవి మాత చిత్రపటాన్ని బహుకరించిన కొత్త కొండబాబు మాధురి రత్న ఆండాళ్ దంపతులు
ఆర్యవైశ్యుల కులదైవం, ఇలవేల్పు వాసవి మాత జయంతి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1021వ జయంతి కావడంతో ఈ ఏడాది వేడుకలను మరింత వైభవంగా నిర్వహించినట్లు జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవి మాత జయంతి వేడుకల్లో పాల్గొన్న చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు ఆర్యవైశ్యుల పేదవారందరికీ అందించడం జరుగుతుందని ఆర్యవైశ్యుల్లో ఉన్నవారు లేని వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కొత్త బైరవకృష్ణ, మానేపల్లి బంగార్రాజు, కంచర్ల శ్రీనివాసరావు(పద్మ సిరామిక్స్), కొత్త రాము, వి నాగసత్య, అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు ప్రముఖులు పాల్గొన్నారు.









