Hot Posts

6/recent/ticker-posts



 ప్రమాణ స్వీకారానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ, జిల్లా అధ్యక్షులు జ్యోతల నవీన్ దంపతులను ఆహ్వానించిన పాలచర్ల నాగేంద్ర చౌదరి

కాకినాడ జిల్లా జగ్గంపేట : అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులుగా ఈనెల 24న అన్నవరం దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు  టిడిపి యువనేత, అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తెలియజేశారు. బుధవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ ను, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులను, కుమారుడు అనీష్ నెహ్రూను కలిసి  24వ తేదీన అన్నవరంలో జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి హాజరైఆశీర్వదించవలసిందిగా కోరిన పాలచర్ల నాగేంద్ర చౌదరి. ఈ సందర్భంగా పాలచర్ల నాగేంద్ర చౌదరిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24న అన్నవరంలో జరిగే నా ప్రమాణస్వీకారం కి జగ్గంపేట నియోజకవర్గంలోని టిడిపి, జనసేన, బిజెపి కుటమి నాయకులందరూ విచ్చేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నానని ఆయన తెలియజేశారు.