హాజరైన టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ తదితరులు
- కాకినాడ జిల్లా జగ్గంపేట :తిరుమలలో శనివారం అత్యాధునిక ఆహార పదార్థాల తనిఖీ కేంద్రాలు (ఫుడ్ ల్యాబరేటరీ) ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు, ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్సీలు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేష్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ ల్యాబ్‌లో నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతను పరీక్షించనున్నారు అని అన్నారు. శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు వంటి ముడిసరకుల్లో కల్తీని సూక్ష్మస్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలు ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. అని దాదాపు రూ. 25 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రయోగశాలను నిర్మించారు అని అన్నారు.
ఇది దేశంలోనే తొలి అత్యాధునిక ఫుడ్ ల్యాబ్, ఇక్కడ ప్రసాదాల్లో వినియోగించే ముడిసరుకుల్ని పరీక్షించేలా ల్యాబ్ ప్లాన్ చేశారు. ప్రతి నెల 1,000 నుండి 1,500 నమూనాలపై పరీక్షలు నిర్వహిస్తారు. అని నెహ్రూ తెలియజేశారు.
తిరుమలలో ఈ ల్యాబ్ ఏర్పాటు కావడం ద్వారా భక్తులకు సురక్షితమైన ప్రసాదాలు అందనున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్పించిన అత్యాధునిక సౌకర్యాల్లో భాగమేనని నెహ్రూ తెలియజేశారు.




