కాకినాడ జిల్లా, జగ్గంపేట మార్చి 18:భారత ప్రభుత్వం తపాలా శాఖ అనుబంధ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కాకినాడ బ్రాంచ్ లోని ఖాతాదారుడు సోమవారం గ్రామానికి చెందిన బత్తిన భద్రం తాపీ పని చేసుకుని జీవనం గడిపేవాడు తాపీ పని సంఘం మేస్త్రి బొందల నాగేశ్వరావు సంఘం తరఫున ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రమాద బీమా పాలసీని స్థానిక సోమవరం గ్రామ తపాలా కార్యాలయంలో చేయించడం జరిగింది . ఇటీవల నవంబర్ మాసంలో తాపీ పని కొరకు పనిపురమయించుకొనుచుండగా సోమవారం బస్టాండ్ సెంటర్లో కారు ప్రమాదం జరిగి అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు
పోస్ట్ ఆఫీస్ లో తీసుకున్న ప్రమాద బీమా పాలసీ కొరకు తగిన డాక్యుమెంట్లు పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో అందించగా సదరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ వారు బీమా సంస్థ ద్వారా 10 లక్షల బీమాను క్లైమ్ చేయించి చేయించారు ఈ బీమా స్థానిక రావులమ్మ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేట శాసనసభ్యులుజ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా కాకినాడ డివిజన్ తపాలా శాఖ అధికారి శ్రీ కె కృష్ణ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రీజనల్ అధికారి విపి సురేష్ కాకినాడ బ్రాంచ్ మేనేజర్ కలపాల రాజ్ కుమార్ పెద్దాపురం సబ్ డివిజన్ అధికారి బ్రహ్మం నాయక్ జగ్గంపేట మాస్టర్ అజయ్ సోమవరం గ్రామం బ్రాంచ్ తపాలా పోస్ట్మాస్టర్ పేపకాయల వీర్రాజు తదితరులు కార్యకర్తలు సమక్షంలో చెక్కు అందజేయడం జరిగింది.
జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ అందిస్తున్న పోస్టల్ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆటో యూనియన్ సభ్యులందరికీ ఈ పాలసీని చేయించేందుకు హామీ ఇచ్చారు. టిడిపి కార్యకర్తలు కూడా 50- 50 భాగస్వామ్యం తో హెల్త్ పాలసీలు చేయిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, పాండ్రంగి రాంబాబు, బోదిరెడ్ల సుబ్బారావు, రాయి సాయి, వైభోగుల కొండబాబు యాదవ్, గల్లా రాము, మంచి కంటి శ్రీను, యడలి రాంబాబు, నాలుగు మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

