Hot Posts

6/recent/ticker-posts



 మార్చి 27,28,29 తేదీలలో విజయవాడలో ఐజేయు జాతీయ ప్లీనరీ సమావేశాలు

....ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

    కాకినాడ జిల్లా జగ్గంపేట  : 

                   మార్చి 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు విజయవాడలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) జాతీయ ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు     ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర  ఉపాధ్యక్షులు కె. స్వాతి ప్రసాద్  పేర్కొన్నారు . జగ్గంపేట లో   ఏపీయూడబ్ల్యూజే నాయకులు అడపా వెంకట్రావు  అధ్యక్షతన  ప్లీనరీ సన్నాహక సమావేశం నిర్వహించారు . అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాలను జయప్రదం చేయాలన్నారు.మార్చి 27వ తేదీ మొదటి రోజు ఐజేయు జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. రెండో రోజు మార్చి 28వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఐజేయు జాతీయ ప్లీనరీ సమావేశాలను ప్రారంభిస్తారని తెలిపారు .మూడవ రోజు మార్చి 29వ తేదీన ఐజేయు ప్లీనరీ మహాసభ, నూతన కార్యవర్గ ఎన్నిక, ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు .దేశంలోని 29 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరవుతారని పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే సంఘం ఐజేయుకు అనుబంధంగా పనిచేస్తుందన్నారు. అలాగే ఏపీ డబ్బులు చేయకు అనుబంధంగా అనేక సంఘాలు పనిచేస్తున్నాయన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు.       స్థానిక విలేకరుల సమస్యలను ప్రస్తావించగా స్వాతి ప్రసాద్ తక్షణమే స్పందించారు. ప్రతి సమస్య పరిష్కారానికకి ఏపీయూడబ్ల్యూజే భరోసా కల్పిస్తుంది అన్నారు. వివాదాస్పదంగా మారిన ఇళ్లస్థలాలు విషయమై ఆందోళన చెందవద్దన్నారు. సంబంధిత సమస్యలపై డివిజన్ స్థాయి అధికారులతో మాట్లాడారు. విలేకరులకు ఇబ్బంది కలిగితే జిల్లా కలెక్టర్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. జిల్లా అధ్యక్ష, అర్జున్ ప్రసంగించారు. సంఘ బలోపేతానికి ప్రతినెల నియోజకవర్గ వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సంఘ బలోపేతానికి, విలేకరుల సమస్యల పరిష్కారానికి అనునిత్యం పనిచేస్తామన్నారు ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పల్లంరాజు, ఆర్ రాంబాబు, సురేష్, పి సూరిబాబు, సిహెచ్  రాంబాబు, లక్ష్మణ్, బాబ్జి,  శ్రీనివాస్, శ్రీధర్  జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.