జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రప్పాలెం పంచాయతీ పరిధిలో సొంత భూమి ఉన్న రైతులకు బుధవారం పట్టాదారు పాసు పుస్తకాలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతులు మీదుగా రైతులకు పంపిణీ చేసారు..ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వే చేసి పాసు పుస్తకాలు అందిస్తుంది గత ప్రభుత్వం రైతులు యొక్క పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రణ తో ఇవ్వగనేడు కూటమి ప్రభుత్వం కేవలం రాజముద్ర తో రైతులకు అందిస్తుందిఈ కార్యక్రమం ప్రతీ నెల జరుగుతుంది అని రైతులకు సంబందించి తప్పులు లేని పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమం జరుగుతుంది అని అన్నారు
ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, అధికారులు,మండల అధ్యక్షులు జీను మణిబాబు,బుర్రే సత్తిబాబు, అడబాల వెంకటేశ్వరావు, దేవరపల్లి మూర్తి, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు

