కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రప్పాలెం పంచాయతీ సగరపేట గ్రామంలోమంచానికే పరిమిత మైన నక్కా నాగరాజుని వారి కుటుంబం కష్టాలులో ఉండడం పోoడ్రు బాలనాగు ద్వారా తెలుసుకొని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి నాగరాజు కుటుంబానికి జ్యోతుల నవీన్ ఆర్థికసాయం అందించారు పోండ్రు బాలనాగు 50కేజీలు బియ్యం, ఆర్థికసాయం అందించారు అలాగే కష్ట కాలంలో తోడుగా ఉన్నందుకు నాగరాజు కుటుంబ సభ్యులు జ్యోతుల నవీన్ కు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్,మండలఅధ్యక్షులు జీను మాణిబాబు, బుర్రె సత్తిబాబు,దేవరపల్లి మూర్తి, నీలిఆనoద్, తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు పొండ్రుబాలనాగు, సగరపేట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
