ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం.... జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగంపేట ఫిబ్రవరి : స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య ఖర్చులకు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సల కోసం ఎదురవుతున్న ఆర్థిక బాధలను తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించాలని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సహాయనిది అందిస్తున్నామని పేదవారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందనిఅన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, సొసైటీ చైర్మన్ బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, తిరుమలాయపాలెం సర్పంచ్ పురంశెట్టి శివాజీ, గోవిందపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు, పిట్ట అరుణ్, మారిశెట్టి రాధా, ఉండవల్లి చందు, గండే చినరాజు, కొత్తపల్లి సత్యనారాయణ నలమాటి ఆనంద్, నాని రాజు, ఆయిల్ స్వామి, కొల్లు రామకృష్ణ, హనుమంతు పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు.




