వాహనదారులు నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు ఎస్సై రఘునాథరావు
జగ్గంపేట : వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జగ్గంపేట ఎస్సై టి.రఘునాధరావు సూచించారు. గురువారం జగ్గంపేట సెంటర్ లో ఎస్సై రఘునాధరావు వాహనాలు తనిఖీ నిర్వహించారు. నిబంధనలు పాటించని పలువురికి జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లే డ్రైవర్లు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
