మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గిరిజన గ్రామాలలోని శివాలయాల వద్ద విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సహకారంతో భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
వై.రామవరం మండలం పూతికుంట గ్రామంలో శివాలయం వద్ద, గురబంధ గ్రామం శివాలయం వద్ద, రేగడిపాలెం గ్రామం శివాలయం వద్ద, రంపచోడవరం మండలం చిన్న గెద్దాడ గ్రామం శివాలయం వద్ద, గంగవరం మండలం శర్బవరం గ్రామంలో శివాలయం వద్ద, పైడి పుట్ట గ్రామం శివాలయం వద్ద రాజొ వొమ్మంగి మండలం కిరాబు గ్రామంలో శివాలయం వద్ద, లబ్బర్తి గ్రామం శివాలయం వద్ద, నెల్లి మెట్ల శివాలయం వద్ద కంబాల శ్రీనివాసరావు విరాళంతో, పోలవరం జిల్లా రామసేన ఇంచార్జి కడబాల సుధా సారధ్యంలో 10 వేల మంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు._ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు




