కాకినాడ జిల్లా గండేపల్లి ఫిబ్రవరి 16: ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా సోమవారం కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. దాదాపు 4 లక్షలు విలువైన చెక్కులను కాకినాడలో ఎంపీ వారి కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందించారు అందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలఅధ్యక్షులు ఉలిసి అయిరాజ్ అభ్యర్థన మేరకు జగ్గంపేట నియోజకవర్గనికి చెందిన మల్లేపల్లి గ్రామ వాస్తవ్యలు పితాని నల్లబ్బాయి కి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేయడం జరిగిందిఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వారి పక్కనే నిలబడుతుందని నియోజకవర్గం లో ఎటువంటి ప్రజా అవసరలున్న వారికీ జనసైనికులు అండగా నిలబడి వారి సమస్యలు పరిష్కరానికి ప్రయత్నం చెయ్యాలని జనసైనికులకు ఎంపీ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించడం తన ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సింగూలూరి రాందీపు,గవిని దుర్గాప్రసాద్, జగ్గంపేటమండలయువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, బీసీ సెల్ అధ్యక్షులు పితాని వీరబాబు,క్రియావాలంట్రీ ఉలిసి శ్రీనివాస్ పాల్గొన్నారు.

