Hot Posts

6/recent/ticker-posts



మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించడానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలించడానికి, మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామర్లకోట చేరుకున్నారు. ఆయనకు హెలి ఫ్యాట్ వద్ద కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, స్వాగతం పలికారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు