Hot Posts

6/recent/ticker-posts






 




వేట్లపాలెం అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించిన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్


కాకినాడ జిల్లా : సామర్లకోట మండలం , వేట్లపాలెం అగ్ని ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్య శ్రీ ఫైర్‌వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.