కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం : వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాణసంచా ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ బాలయోగి ఆదివారం వారి గృహాలకు వెళ్లి చెక్కులను అందించారు. సామర్లకోట మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా కుటుంబాలను పరామర్శించిన మంత్రులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

