Hot Posts

6/recent/ticker-posts




వేట్లపాలెంలో బాణాసంచారం పేలుడు సంఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


 కాకినాడ జిల్లా , సామర్లకోట మండలం, వేట్లపాలెంలో బాణసంచా తయారీ సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంట కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఉన్నారు. ఈ ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించి హృదయ విధాకర పరిస్థితి కి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.