Hot Posts

6/recent/ticker-posts



 జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా "ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి"

కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. డి. చెన్నారావు  ఆధ్వర్యంలో తెలుగు విభాగం ప్రముఖ తెలుగు కవయిత్రి శ్రీమతి మొల్ల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్  మొల్ల చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. డి. చెన్నారావు  మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 13 నా కవయత్రి మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిందామని తెలిపారు. తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా నిలిచారని, ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం పొందిందని తెలిపారు. మొల్ల తన సాహిత్యంతో మహిళల ప్రతిభను ప్రపందానికి పరిచయం చేసిన గొప్ప కవయిత్రి అని విద్యార్థులకు తెలియజేశారు. మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడుకున్నదని, ఈ కావ్యాన్ని మొల్ల కేవలం 5 రోజులలో వ్రాసారని ని ప్రతీతి, అని విద్యార్థులకు తెలియజేశారు.

తదుపరి తెలుగు విభాగం అధ్యాపకురాలు డా.డి. సత్యలత  మాట్లాడుతూ మొల్ల జీవిత విశేషాలు, ఆమె రచించిన మొల్ల రామాయణం తేట తెలుగులో, గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుందని విద్యార్ధులకు తెలియజేశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన మొల్ల తన ప్రతిభతో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారని ఆమె చెప్పారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ బాలరాజు , ఐ. క్యూ.ఏ, సి కో-ఆర్డినేటర్ డా. పి .వి.వి. సత్యా నారాయణ , అకడెమిక్ కో-ఆర్డినేటర్ డా.జి. సురేష్ , కెమిస్ట్రీ ఆధ్యాపకులు వి. మల్లికార్జున శర్మ , గణిత ఆద్యాపకులు సి.హెచ్.ఝాన్సీదేవి , ఫిజిక్స్ ఆద్యాపకులు వి. గోపాలకృష్ణ , కామర్స్ ఆధ్యాపకులు పి.పద్మ శేఖర్  మరియు కె.వెంకట రావు , జువాలజీ ఆద్యాపకులు పి.శ్రీనివాస రావు , బోటని ఆధ్యాపకులు పి.నవీన , కంప్యూటర్ ఆధ్యాపకులు వి.దేవి ప్రసన్న , ఇతర అద్యపకేతర సిబ్బంది మరియు విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.