Hot Posts

6/recent/ticker-posts




 ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకే ప్రజాదర్బార్..

కిర్లంపూడిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

కాకినాడ జిల్లా కిర్లంపూడి మార్చి 13: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. కిర్లంపూడి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో  ఆయన శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ప్రజల నుంచి వినతులు, అభ్యర్థనలు స్వీకరించారు. పలు సమస్యలపై వినతులు అందగా అందులో పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.  ప్రజల నుంచి అందిన ప్రతీ వినతి పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా దర్బార్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.