Hot Posts

6/recent/ticker-posts







 జగ్గంపేట లో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులకు శిక్షణ కార్యక్రమం

కాకినాడ జిల్లా: జగ్గంపేట లో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ బ్రాంచ్ కార్యాలయం జగ్గంపేట నందు ఎన్ హెచ్ ఆర్ పి ఫారం రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించుట జరిగింది, 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్.హెచ్.ఆర్. పి ఫోరం సీఈవో చైర్మన్ తూము రామచంద్ర నాయుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్ మాధవి లత హాజరయ్యారు ,ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎన్ హెచ్ ఆర్ పి ఫారం లో జాయిన్ అయిన ప్రతి సభ్యులు శిక్షణ పొందవలసి ఉంటుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరికి శిక్షణా తరగతులు నిర్వహించి శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ సంస్థ ద్వారా జారీ చేయబడుతుంది 

ఈ శిక్షణా తరగతులలో చట్టాలపై అవగాహన ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక మోసాల పట్ల మానవ హక్కులు ఉల్లంఘన పై తీసుకోవలసిన చర్యలు సమస్యలపై సంబంధిత అధికారులకు ఏ విధంగా ఫిర్యాదులు సమర్పించాలి అనే విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది శిక్షణానంతరం హాజరైన సభ్యులు ప్రతి ఒక్కరికి సంస్థ సీఈవో చైర్మన్ తూము రామచంద్ర నాయుడు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ డైరెక్టర్ మాధవి లత చేతుల మీదుగా శిక్షణ పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దూరప్రాంతాల నుంచి శిక్షణ పొందాలని ఆలోచనతో వచ్చిన వారికి శిక్షణ కార్యక్రమానికి  హాజరైన ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథులు ధన్యవాదాలు తెలియజేశారు 

ఈ కార్యక్రమంలో నేషనల్ కమిటీ నుండి సభ్యులు జిల్లాస్థాయి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ కాకినాడ జిల్లా సెక్రటరీ రాఘవ ఇతర సభ్యులు బెంగళూరు అనంతపురం పశ్చిమగోదావరి విశాఖపట్నం కోనసీమ పోలవరం జిల్లాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు ఉన్నటువంటి సభ్యులందరూ  పాల్గొనుట జరిగింది.