Hot Posts

6/recent/ticker-posts



 సూది కొండలో జోరుగా మట్టి తవ్వకాలు 

రోజుకు 20 లారీలుతో తరలింపులు 

కన్నెత్తి చూడని రెవెన్యూ మైనింగ్ అటవీ శాఖ అధికారులు

అనుమతులు లేవంటున్న సూది కొండ  వి ఆర్ ఓ

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో సూది కొండ గ్రామం దగ్గరలో ఎటువంటి అనుమతులు లేకుండా కొండను తవ్వి మట్టి తరలిస్తున్నారు. సామాన్య మధ్య తరగతి పేద కుటుంబాల వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు పది ట్రాక్టర్లు మట్టి తెచ్చుకోవాలంటే ఎన్నో ఆంక్షలు గ్రామంలో ఉన్న వీఆర్ఏ దగ్గర నుండి ఉన్నత అధికారుల వరకు ఆ ట్రాక్టర్లకు అడ్డుగా నిలిచిపోతారు వాళ్లకు జరిమానాలు విధిస్తారు డాక్టర్లను తీసుకెళ్లి సీజ్ చేస్తారు ఇంత హంగామా చేసే ఈ అధికారులకు మట్టి మాఫియా చేసే అక్రమ తవ్వకాలు కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నారా ఈ మట్టి తరలింపులు గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంబంధించిన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులంతా ముడుపులు అందుకొని మాకు ఏమీ కనిపించడం లేదు వినిపించడం లేదు అనే మాదిరిగా అధికారుల తీరు కనిపిస్తుంది

పచ్చని పకృతిని నాశనం చేస్తూ కొండలు తవ్వేసి కోట్లు సంపాదిస్తున్నారు అక్రమార్కులు. కొండను తవ్వి గ్రావిలో రూపంలో మార్చి రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం తోలకాలు జోరుగా కొనసాగిస్తున్నారు.వివరణ కోరగా అనుమతులు లేవుసూదికొండ లో కొండతవ్వి  మట్టి తరలించడానికి  అనుమతులు లేవని సూదికొండ  విఆర్వో తెలియజేశారు.

రెవెన్యూ మైనింగ్ అటవీ శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా స్పందిస్తారాఈ అక్రమ  మట్టి తరలింపుల పైన రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖ ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అని ప్రజలు వాపోతున్నారు