Hot Posts

6/recent/ticker-posts



 జగ్గంపేటలో ఘనంగా ప్రపంచ టైలర్స్ డే వేడుకలు

టైలర్ అసోసియేషన్ భవనంకు స్థలం, నిధులు సమకూర్చిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు నవీన్ కు కృతజ్ఞతలు తెలియజేసిన టైలర్స్ అసోసియేషన్

కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 28: జగ్గంపేట పట్టణంలోని శ్రీ షిరిడి సాయి ప్రైమరీ టైలర్స్ కో ఆపరేషన్ సొసైటీ అసోసియేషన్ టైలర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మంచినీరు చెరువు గట్టు పక్కన గల సంఘ భవనం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ కె రమణ, వైస్ ప్రెసిడెంట్ టీ 4 శ్రీను హాజరై మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 అనంతరం టైలర్స్ జండా ఆవిష్కరించి జండా వందనం చేశారు. జగ్గంపేట పట్టణంలోవిలియమ్స్ హోవే చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ  రోజురోజుకు పెరిగి పోతున్న రేడిమేడ్ రంగం ప్రభావంతో మేర కులస్తులు, దీనిపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాల పరిస్థితి ఆగమ్యగో చరంగా మారిందన్నారు.  ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ సహకారంతో టైలర్ అసోసియేషన్ భవనానికి స్థలం, నిధులు సమకూర్చగా భవనం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఇల్లు లేని టైలర్స్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కోరుకుంటున్నామని తెలియజేశారు. టైలర్స్ ను అన్ని విధాల ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి  విన్నవించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో గౌరవాధ్యక్షులు వై నాగబాబు, సెక్రెటరీ కే నాగేశ్వర రావు (చిన్ని) ట్రెజరర్ ఏ ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ ఎన్ వాసు, శ్రీ షిరిడి సాయి ప్రైమరీ టైలర్స్ కో ఆపరేషన్ సొసైటీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.