Hot Posts

6/recent/ticker-posts

ఇండిపెండెంట్ అభ్యర్థి సూర్యచంద్ర ఆరోపణలను ఖండించిన జగ్గంపేట టిడిపి నాయకులు


ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై పాఠంశెట్టి సూర్యచంద్ర చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జగ్గంపేట మండల టిడిపి నాయకులు

జగ్గంపేట నియోజకవర్గం లో సాగునీటి ప్రాజెక్టులకు 190 కోట్లు, రోడ్లకు 66 కోట్లు నిధులు నీకు కళ్ళు కనబడడం లేదా సూర్యచంద్ర ఖబర్దార్..

కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపైన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ పైన, చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్తిబాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, జగ్గంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేటటౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి మాట్లాడుతూ పాఠం శెట్టి సూర్యచంద్ర తన స్థాయిని పెంచుకోవడానికి జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ 190 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు, 100 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు, సిమెంట్ రోడ్లు మౌలిక వసతులకు నిధులు తీసుకొచ్చి తాళ్లూరు ఎత్తిపోతల పథకానికి 52, మల్లవరం ఎత్తిపోతల పథకానికి 130 కోట్లు, మామిడాడలో జ్యోతుల పాపారావు ఎత్తిపోతల పథకంకు 3. 5కోట్లు నిధులు తీసుకురావడం కాకుండా, నాలుగు మండలాల్లో సిమెంట్ రోడ్లు, గ్రామాల లింకు రోడ్లకు 66 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారని అంతేకాకుండా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం, 

రెండు కోట్ల రూపాయలతోఆడబిడ్డలకు పెళ్ళికానుక అందించడం 80 లక్షల రూపాయలతో మెగా డీఎస్సీ ఏర్పాటు చేసి 30 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ సూర్యచంద్ర కళ్లకు కనపడటం లేద అని వారు ప్రశ్నించారు. ముఖ్యంగా సత్యమేవ జయతి అని జండా కారు కట్టుకుని తిరగడం కాదని సత్యాన్ని మాట్లాడటం నేర్చుకోవాలని అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరని శివ కేశవుల కు నిత్యం పూజలు చేసే జ్యోతుల నెహ్రూపై అసత్య ఆరోపణలు చేస్తే ఆ దేవుడే నిన్ను శిక్షిస్తాడని వారు అన్నారు. ఇదే సూర్యచంద్ర పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ గతంలో ఇంటింటికి తిరిగి టిడిపి జనసేన బిజెపి కుటమిగా ఏర్పడడంతో తనకు సీటు రాదని అప్పటినుంచి కూటమి పార్టీలపై విషం కక్కుతూ కొంతమందితో కుమ్మక్కై గత ఎన్నికల్లో ఎన్నారైల ద్వారా, అప్పటి అధికార పార్టీ ద్వారా కోట్లాది రూపాయల నిధులు సమకూర్చుకుని ఎన్నికల్లో ఏవిధంగా ఖర్చు పెట్టారో మనందరికీ తెలుసు అని వారు అన్నారు. 

అభివృద్ధి సాధకులు జ్యోతుల నెహ్రూ రాష్ట్రంలో జగ్గంపేట నియోజకవర్గం 11వ స్థానంలో ఏ ప్లస్ గ్రేడ్ తో ముందుకు వెళుతుంటే అది చూడలేని సూర్యచంద్ర ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని అవినీతి జరుగుతుందంటూ అసత్య ఆరోపణ చేయడం విడ్డూరం గా ఉందని వారు అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మూడు రోజుల్లోనే రెండుసార్లు మాట్లాడి గ్రామాల్లో మైక్రో ఫిల్టర్ ద్వారా మంచినీటిని అందించాలని, జాతీయ రహదారులపై ప్రమాదాల లో గాయపడిన వారిని రక్షించడానికి జగ్గంపేటలో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని ఇవి సూర్యచంద్ర కనపడటం లేదా అని ఆరోపించారు.