Hot Posts

6/recent/ticker-posts



 అనధికారికంగా ప్రమాదకరంగా ఉన్న హైవే రోడ్డు క్రాసింగ్ పాయింటును క్లోజ్ చేయించిన పోలీస్ వారు

కాకినాడ జిల్లా , ఫిబ్రవరి ,19 2026 ,ప్రత్తిపాడు మండలం : కత్తిపూడి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వారి ఉత్తర్వుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి శ్రీహరి రాజు సూచనలతో ప్రత్తిపాడు సిఐ బి సూర్య అప్పారావు మరియు అన్నవరం ఎస్ఐ నేషనల్ హైవే 16 పై కత్తిపూడి హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద అనధికారికంగా రోడ్డు క్రాసింగ్ పాయింట్ ఉండుట కారణంగా సంవత్సర కాలంలో నాలుగు యాక్సిడెంట్లు అందులో మూడు మరణాలు మరియు ఇద్దరికీ గాయాలు తగలడం జరిగినది దీనిని గుర్తించిన కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆ యొక్క రోడ్డు క్రాసింగ్ పాయింట్ ను మూసివేయడం జరిగినది.

 కావున ప్రజలందరికీ విన్నవించుకునేది ఏమనగా అనధికారికంగా హైవేను క్రాసింగ్ చేయొద్దని దానివలన ఎక్కువ ప్రమాదాలు జరుగుచున్నవని అన్నవరం పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగినది